TS Govt : వైద్యారోగ్య శాఖలో పదోన్నతులు.. వారంలోగా పూర్తి చేయాలని ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచింగ్ ఆస్పత్రిలో 190 అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పదోన్నతులు, బదిలీ అంశాలపై దిశానిర్దేశం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వెంటనే కౌన్సిలింగ్ పూర్తి చేసి పోస్టింగ్ లు ఇవ్వాలని చెప్పారు. ఆదే విధంగా ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలను వెల్లడించారు.
నిమ్స్ నూతన బిల్డింగ్ నిర్మాణం పనులు వేగవంతం చేయాలి
ప్రొఫెసర్ నుంచి అడిషనల్ డీఎంఇగా పదోన్నతి పొందేందుకు వయోపరిమితిని 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోని 112 డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ సర్జన్ పదోన్నతుల ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. డెంగ్యూ పరీక్ష నిర్ధారణ కోసం ఉపయోగించే 32 సింగిల్ డోనార్ ప్లేట్ లెట్స్ మిషన్ల ను రూ.10 కోట్లతో కొనుగులు చేసి, జిల్లాలోని అన్ని ఆస్ప్రతిలో ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. నిమ్స్ నూతన బిల్డింగ్ నిర్మాణం పనులు వేగవంతం చేసి, 228 అమ్మఒడి వాహనాలు, (204) 108 వాహనాలు, 34 హర్సే వాహనాలను ఆగస్టు 1వ తేదీన ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.