Heart Attack: పెను విషాదం.. కోచింగ్ క్లాస్‌లో వింటూ గుండెనొప్పితో మృతిచెందిన సివిల్ సర్వీసెస్ విద్యార్థి
మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి ఇండోర్‌లోని తన కోచింగ్ క్లాస్‌లో కుప్పకూలి మరణించాడు. సాగర్ జిల్లాకు చెందిన రాజా లోధిగా భాదితుడిని గుర్తించారు. క్లాస్ వింటున్న మాధవ్ కు అకస్మాత్తుగా గుండె నొప్పితో బాధపడుతుండడం తోటి విద్యార్థులు గుర్తించి అతనికి సాయం అందిచేందుకు ప్రయత్నించారు. తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీలో ఈ ఘటన మొత్తం రికార్డయింది. అనంతరం తోటి విద్యార్థులు రాజా లోధిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా,అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇటీవల ఇలాగే ఇండోర్ నగరంలో ముగ్గురు యువకులు గుండెపోటుతో మరణించారు. మృతికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతున్నారు.