UP Serial Killer : తొమ్మిది మహిళలను చంపిన 'సీరియల్ కిల్లర్' అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ లో 13 నెలల వ్యవధిలో తొమ్మిది మహిళలను హత్య చేసిన సిరీయల్ కిల్లర్ ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. 'ఆపరేషన్ తలాష్' పేరుతో చేసిన సెర్చ్ ఆపరేషన్ విజయవంతమైందని పోలీసులు పేర్కొన్నారు. యూపీ సీరియల్ కిల్లర్ పేరు కుల్దీప్ కుమార్ గంగ్వార్ అని, అతడి వయస్సు 38 ఏళ్లుగా గుర్తించారు. తర్వాత 38 ఏళ్ల కుల్దీప్ కుమార్ గంగ్వార్‌గా గుర్తించబడిన నిందితుడిని ఆగస్టు 8 న అరెస్టు చేశారు. ఈ కేసు కోసం 22 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు
Details
మానసిక సమస్యలే కారణమన్న పోలీసులు
జులై 2023, జులై 2024 మధ్యలో బరేలీకి సమీపంలోని గ్రామాల్లో మహిళలను ఈ సీరియల్ కిల్లర్ చంపాడు. ఒంటరిగా కనపడిన మహిళల దగ్గరికి వెళ్లి లైంగికంగా వేధించడం, ఒప్పుకోకపోతే గొంతు నులిమి చంపడం ఈ సీరియల్ కిల్లర్‌కి అలవాటు. బాల్యంలో జరిగిన పలు ఘటనలు అతడి మానసిక సమస్యలకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. తన తల్లి బ్రతికుండానే తండ్రి వేరే మహిళను పెళ్లి చేసుకోవడం కుల్దీప్ చూశాడు.
Details
హత్యలు చేసినట్లు ఒప్పుకున్న నిందితుడు
ఇక ఇంట్లో జరిగిన గృహ హింస కుల్దీప్ ని ప్రభావితం చేయడంతో సవతి తల్లిపై కోపం పెంచుకున్నాడు. ఆ తర్వాత అందరి మహిళలను అలాగే చూడడం మొదలు పెట్టాడు. ఇక నిందితుడిని అరెస్టు చేసి విచారించగా, ఆరు నేరాలను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మరో మూడు హత్యలు అతడే చేసినట్లు ఆధారులున్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సైకియాట్రిస్ట్‌ని సంప్రదిస్తున్నట్లు తెలిపారు.