Page Loader
సైకో ఘాతుకం; స్నాప్‌చాట్‌లో ప్రేమించిన మహిళ అనుకొని మరో యువతి హత్య
సైకో ఘాతుకం; స్నాప్‌చాట్‌లో ప్రేమించిన మహిళ అనుకొని మరొకరిని హత్య చేసిన యువకుడు

సైకో ఘాతుకం; స్నాప్‌చాట్‌లో ప్రేమించిన మహిళ అనుకొని మరో యువతి హత్య

వ్రాసిన వారు Stalin
Apr 06, 2023
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ హత్య జరిగింది. అమలాపురం పట్టణంలో ఈనెల 4న నెల్లూరు జిల్లాకు చెందిన కోట హరికృష్ణ ఓ మహిళను కత్తితో నరికి చంపాడు. స్నాప్‌చాట్‌లో హరికృష్ణ ప్రేమించిన నాగదుర్గ అనే మహిళ అతని ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో సైకో మనస్థతత్వం ఉన్న అతను ఆ మహిళను హత్య చేసేందుకు అమలాపురం పట్టణానికి వచ్చాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో తను ప్రేమించిన నాగదుర్గ అనుకొని మరో యువతిని దారుణంగా హత్య చేశాడు. హరికృష్ణ హత్య చేయాలనుకున్ననాగదుర్గ, మన్నె శ్రీదేవి(28) ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తోంది.

ఆంధ్రప్రదేశ్

స్నాప్‌చాట్‌లో నాగదర్గ-హరికృష్ణ పరిచయం

ఐదు నెలల క్రితం స్నాప్‌చాట్‌లో హరికృష్ణ, నాగదుర్గ ఒకరికొకరు పరిచయమయ్యారని ఓ పోలీసు అధికారి తెలిపారు. వారు స్నేహితులుగా మారారు. తరచుగా ఫోన్‌లో మాట్లాడుకునేవారు. చాటింగ్ చేసేవారు. ఈ క్రమంలో హరికృష్ణ నాగదుర్గను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. తనకు పెళ్లైందని, అతడి ప్రపోజల్‌ను తిరస్కరించింది. దీంతో ఆగ్రహించిన హరికృష్ణ ఆమెను హత్య చేసేందుకు అమలాపురం పట్టణానికి వచ్చాడు. చాటింగ్ సమయంలో నాగదుర్గ తన అడ్రస్ చెప్పింది. దీంతో మద్యం మత్తులో నాగదుర్గ ఇంటికి వచ్చాడు. ఇంట్లో నాగదుర్గ మరో యువతితో కలిసి ఉన్న ఫొటోను చూశాడు. ఆ ఫొటోలో ఉన్న యువతి(శ్రీదేవి)ని పక్కనే ఉన్న డాబాపై చూసి, ఆమెపై కత్తితో దాడి చేసాడు. దీంతో శ్రీదేవి అక్కడిక్కడే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.