Page Loader
Mahanadu 2025: పసుపు రంగుతో కళకళలాడుతున్న కడప.. ఐదు లక్షలమందితో బహిరంగ సభకు ఏర్పాట్లు
పసుపు రంగుతో కళకళలాడుతున్న కడప.. ఐదు లక్షలమందితో బహిరంగ సభకు ఏర్పాట్లు

Mahanadu 2025: పసుపు రంగుతో కళకళలాడుతున్న కడప.. ఐదు లక్షలమందితో బహిరంగ సభకు ఏర్పాట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

కడప జిల్లాలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నిర్వహిస్తున్న వార్షిక మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఈ మహానాడును పండగలా జరుపుకుంటున్నారు. ఇప్పటికే ఈ మహాసభలకు సంబంధించిన రెండు రోజుల కార్యాచరణ విజయవంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్విరామంగా జరిగిన సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు సాగాయి. పసుపు పండుగగా భావిస్తున్న ఈ మహానాడులో రెండో రోజు ప్రతినిధుల సమావేశాలు ముగిశాయి. ఇక తుది రోజు అయిన గురువారం, మహానాడుకు విశిష్ట స్థానం దక్కనుంది.

Details

మధ్యాహ్నం భారీ బహిరంగ సభ

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో పార్టీ అధినేత సహా ముఖ్య నాయకులు ప్రసంగించనున్నారు. ఏక సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మరియు భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నారు. ఈ సభను రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చే ప్రజలు వీక్షించనున్నారు. గురువారంనాటి బహిరంగ సభలో పాల్గొననున్న లక్ష మందికి భోజన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతేగాక, కడపకు వచ్చే మార్గాల్లో ప్రయాణించే మరో రెండు లక్షల మందికి కూడా భోజన సదుపాయాలు కల్పించారు.

Details

ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు

అన్ని రకాల వసతులతో సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. ట్రాఫిక్‌ సమస్యలొచ్చకుండా పోలీసులు, అధికారులు సమర్థవంతంగా చర్యలు తీసుకున్నారు. రెండో రోజుతో పోలిస్తే మరింత అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కడపకు చేరుకుంటున్నారు. పలు ప్రాంతాల నుంచి కార్యకర్తల రాక ఇప్పటికే ప్రారంభమైంది. కడప నగరం మొత్తం గత నాలుగు నుంచి ఐదు రోజులుగా పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో ఉత్సాహవంతంగా మారింది. పట్టణం అంతా పండుగ వాతావరణంతో సందడిగా మారింది. మొత్తంగా చూస్తే, టీడీపీ మహానాడు తుదిదశకు చేరుకుంటున్న ఈ వేళ, గురువారంనాటి బహిరంగ సభలో పార్టీ భావితరాలకు దిశానిర్దేశం చేసే కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.