Page Loader
Puja Khedkar : పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్.. అభ్యర్థిత్వం రద్దు చేసిన యూపీఎస్సీ
పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్.. అభ్యర్థిత్వం రద్దు చేసిన యూపీఎస్సీ

Puja Khedkar : పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్.. అభ్యర్థిత్వం రద్దు చేసిన యూపీఎస్సీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 31, 2024
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్(34) కు యూపీఎస్సీ బిగ్ షాకిచ్చింది. ఆమె అభ్యర్థిత్వం రద్దుతో పాటు భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షల నుంచి అమెను డిబార్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలను విచారించిన తర్వాత యూపీఎస్సీ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో ఆమె భవిష్యత్ అంధకారమైంది. ఆమెకు పరీక్షకు హాజరైన ప్రతిసారి నకిలీ పత్రాలు సృష్టించి హాజరైనట్లుగా గుర్తించారు. ముఖ్యంగా ఆమె పేరుతో పాటు తల్లిదండ్రుల పేర్లు కూడా పలుమార్లు మార్చినట్లు విచారణలో వెల్లడైంది.

Details

నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు

ఇప్పటికే పూజా ఖేద్కర్ ఫై యూపీఎస్సీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పూణేలో శిక్షణలో ఉండగా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా సమాచారం. ఆరోపణలన్నింటిపై యూపీఎస్సీ విచారణ చేసి చర్యలను తీసుకుంది. సివిల్ సర్వీస్ పరీక్ష పాసయ్యేందుకు అమె నకిలీ దివ్యాంగురాలి సర్టిఫికెట్ తో పాటు ఓబీసీ కోటా వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక 2007లో ప్రయివేటు మెడికల్ కళాశాలలో ప్రవేశం కోసం కూడా నకిలీ ఫిట్ నెస్ సర్టిఫికెట్ సమర్పించింది.