
Puja Khedkar: కిడ్నాప్ కేసులో పూజా ఖేద్కర్ పేరెంట్స్‌కు బెయిల్..
ఈ వార్తాకథనం ఏంటి
ట్రక్కు డ్రైవర్ కిడ్నాప్ కేసులో మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లిదండ్రులకు బెయిల్ లభించింది. గత నెలలో నవీ ముంబైలో ట్రక్కు డ్రైవర్ ఒక కారు ను ఢీ కొట్టిన తర్వాత వ్యక్తిని కిడ్నాప్ చేశారు. పోలీసులు తనిఖీలు చేసినప్పుడు పూణేలోని పూజా ఖేద్కర్ నివాసంలో ఆ కారు లభించింది. తరువాత, డ్రైవర్‌ను విడుదల చేయమని అడిగినప్పుడు, పూజా తల్లి మనోరమ పోలీసులపై కుక్కలను ఉసిగొల్పింది. పోలీసులు వెంటనే లోపలికి దూకి డ్రైవర్‌ను సురక్షితంగా రక్షించారు. ఆనాటి నుంచి పూజా తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. తాజాగా ఈ కేసులో ఊరట లభించింది. పూజా తల్లిదండ్రులు దిలీప్ ఖేద్కర్, మనోరమకు బెయిల్ మంజూరు అయింది.
వివరాలు
అనేక వివాదాల్లో పూజా ఖేద్కర్
దిలీప్ ఖేద్కర్ పోలీసులు తప్పుగా తమను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. దర్యాప్తులో వారికి పూర్తి సహకారం అందించామని, అయినప్పటికీ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాము ఎటువంటి నేరం చేయలేదని.. కాబట్టి ఎవరికీ భయపడాల్సిన పని లేదన్నారు. ఈ కేసులో తమకు ఏ విధమైన ప్రమేయం లేదని కూడా తెలిపారు. కాగా,పూజా ఖేద్కర్ కుటుంబం అనేక వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలుస్తున్నారు. 2024లో యూపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినందుకు పూజా ఖేద్కర్ నిర్బంధం ఎదుర్కోవలసి వచ్చింది.
వివరాలు
పొలంలో ఒక రైతును తుపాకీతో బెదిరించిన తల్లి
ఐఏఎస్ ఉద్యోగాన్ని కోల్పోయి, భవిష్యత్తులో ఏ యూపీఎస్సీ పరీక్షల్లో కూడా పాల్గొనవద్దని నిషేధం విధించబడింది. అదనంగా, పొలంలో ఒక రైతును తుపాకీతో బెదిరించిన ఘటనలో తల్లి మనోరమ జైలు పాలయ్యారు. తండ్రి దిలీప్ ఖేద్కర్ కూడా అక్రమాస్తులు సంపాదించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారని, ఆ డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేసినట్లు విమర్శలు ఎదుర్కొన్నారని సమాచారం ఉంది.