
Pulivendula ZPTC Election: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఈ రెండు స్థానాలకు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ బ్యాలెట్ పద్ధతిలో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉద్రిక్తతలు తలెత్తకుండా పలువురు రాజకీయ నేతలను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది ఓటర్లు, ఒంటిమిట్టలోని 30 పోలింగ్ కేంద్రాల్లో 24,000 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
Details
రెండు మండలాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
రెండు మండలాల్లో కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పులివెందుల-ఒంటిమిట్ట సరిహద్దులు, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పులివెందులలో భద్రతా బందోబస్తును కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఆ ప్రాంతంలో ఉండకూడదని పోలీసులు స్పష్టం చేశారు.