LOADING...
పంజాబ్‌: భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి
పంజాబ్‌: భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి

పంజాబ్‌: భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి

వ్రాసిన వారు Stalin
Apr 13, 2023
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్‌లోని భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ తన సర్వీస్ వెపన్ పేలిపోవడంతో అతను మరణించినట్లు గురువారం పోలీసులు తెలిపారు. భటిండాలో మిలిటరీ క్యాంపులోని హత్యలకు దీనికి ఎంలాంటి సంబంధం లేదని పోలీసులు వెల్లడించారు. భటిండా మిలటరీ స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ తెలిపింది. సైనికుడు తన సర్వీస్ వెపన్‌తో సెంట్రీ డ్యూటీలో ఉన్నాడని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. సైనికుడు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోందని వెల్లడించారు. అతను కాల్చుకున్న వెంటనే సమీపంలోని సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భటిండా ఎస్‌హెచ్ఓ గురుదీప్ సింగ్ వివరణ