Page Loader
Amaravati Brand Ambassador : రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు.. అర్హతలు, బాధ్యతలు ఏంటి?
రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు.. అర్హతలు, బాధ్యతలు ఏంటి?

Amaravati Brand Ambassador : రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు.. అర్హతలు, బాధ్యతలు ఏంటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 15, 2025
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా, బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని నిర్ణయించింది. పురపాలక శాఖ దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. వీరి ఎంపిక నామినేషన్ విధానంలో జరగనుంది. ముఖ్యమంత్రి లేదా సీఎం కార్యాలయం సూచించిన వ్యక్తులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక కావచ్చు.

వివరాలు 

ఎంపిక ప్రక్రియ - సీఆర్‌డీఏ కీలక భూమిక 

నామినేషన్లను సమీక్షించి, అర్హతలు, ప్రాముఖ్యత ఆధారంగా సీఆర్‌డీఏ (Capital Region Development Authority) వీరిని ఎంపిక చేయనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో, ఒక సంవత్సరం కాలానికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నియమితులైన వారి పనితీరు ఆధారంగా పదవీకాలాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. అమరావతిని విస్తృతంగా ప్రమోట్ చేసే విధంగా వీరు పనిచేయాలని ప్రభుత్వ లక్ష్యం.

వివరాలు 

ఎవరికి అర్హత? 

సాంకేతికత, సామాజిక సేవ, అభివృద్ధి వంటి రంగాల్లో విశ్వవ్యాప్త గుర్తింపు ఉండాలి. బ్రాండింగ్‌పై విశేష నైపుణ్యం కలిగి ఉండాలి. అమరావతి అభివృద్ధికి కట్టుబడి, స్థానిక ప్రజలతో మమేకమైన వ్యక్తులై ఉండాలి. ఈ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని, దరఖాస్తులను సీఆర్‌డీఏ పరిశీలించి ప్రభుత్వ ఆమోదంతో ఎంపిక చేస్తుంది. బ్రాండ్ అంబాసిడర్ల బాధ్యతలు అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా ప్రచారం చేయాలి. పరిపాలన, అభివృద్ధి, ఆర్థిక అవకాశాలను వివిధ వేదికలపై వివరించాలి. ప్రపంచ స్థాయిలో అమరావతిని "స్మార్ట్ సిటీ"గా మన్నించబడేలా కృషి చేయాలి. సభలు, సదస్సులు, ఇంటర్వ్యూలు, బ్లాగ్స్, సామాజిక మాధ్యమాల ద్వారా అమరావతి ప్రగతిని ప్రజలకు తెలియజేయాలి.

వివరాలు 

ఇవి చేయకూడదు! 

అమరావతి అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరించడం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ హోదాను ఉపయోగించుకోవడం. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలకు ఆటంకం కలిగించడం. విజన్ అమరావతి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, పెట్టుబడులను ఆకర్షించేందుకు బ్రాండ్ అంబాసిడర్లు కృషి చేయాలి.