Page Loader
Anil Kumar Yadav: క్వార్ట్జ్‌ కుంభకోణం.. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు!
క్వార్ట్జ్‌ కుంభకోణం.. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు!

Anil Kumar Yadav: క్వార్ట్జ్‌ కుంభకోణం.. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 22, 2025
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా కేసులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ కేసులో కీలక పురోగతిగా, అనిల్‌కు సన్నిహితుడైన బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని ఏపీ పోలీసులు సోమవారం హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. విచారణలో ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా అనిల్‌తో పాటు మరొక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కూడా ఉచ్చు బిగుస్తోంది. కాకాణి ఇప్పటికే అరెస్టయ్యి రిమాండ్‌లో ఉన్నారు. 2023 ఆగస్ట్‌ నుంచి అనిల్‌, కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి నేను క్వార్ట్జ్‌ వ్యాపారం చేశాను.

Details

ప్రతి టన్నుకు రూ.1000 

లీజు గడువు ముగిసిన తర్వాత కూడా రుస్తుం మైన్‌ నుంచి మేము క్వార్ట్జ్‌ తవ్వించాం. ఈ పనులను వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించేవాళ్లు. వారి పర్యవేక్షణకు ప్రతీ టన్నుకు నాకు రూ.1000 ఇచ్చేవారు. తవ్విన క్వార్ట్జ్‌ను ఏనుగు శశిధర్‌రెడ్డి పొలంలో నిల్వ చేసేవాళ్లం. ఆ స్థలాన్ని ఉపయోగించుకునేందుకు ఆయనకు ఎకరాకు రూ.25వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నామని శ్రీకాంత్‌రెడ్డి పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. అంతేకాకుండా.. ''రుస్తుం మైన్‌ నుంచి తవ్విన క్వార్ట్జ్‌ను మేము చైనాకు ఎగుమతి చేశాం. దీనికోసం దువ్వారు శ్రీకాంత్‌రెడ్డిని మాదిగ వినియోగించుకున్నాం. ఈ వ్యాపారంలో వచ్చిన డబ్బుతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాం.

Details

రియల్ ఎస్టేట్ పేరుతో వెంచర్లు ప్రారంభం

గూడూరులో 100 ఎకరాల్లో, నాయుడుపేట వద్ద 50 ఎకరాల్లో అనిల్‌తో కలిసి రియల్‌ ఎస్టేట్ వెంచర్లు ప్రారంభించాం. అలాగే, హైదరాబాద్‌లో రెండు హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాం. మణికొండ అల్కాపురిలో 'హెవెన్లీ హోమ్స్‌', తుర్కయాంజల్‌లో 'గ్రీన్ మెడోస్‌' పేరుతో వెంచర్లు వేశాం. 2024లో కేసులకు భయపడి హైదరాబాద్‌కి మకాం మార్చామని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఈ ప్రకటనలతో అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎదుర్కొంటున్న కష్టాలు మరింత ముదురనున్నట్లు అర్థమవుతోంది.