Page Loader
Rahul Gandhi : మేడిగడ్డను పరిశీలించిన రాహుల్‌గాంధీ.. బీఆర్ఎస్‌కు ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ఆవేదన  
బీఆర్ఎస్‌కు ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ఆవేదన

Rahul Gandhi : మేడిగడ్డను పరిశీలించిన రాహుల్‌గాంధీ.. బీఆర్ఎస్‌కు ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ఆవేదన  

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 02, 2023
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఈ మేరకు ఏరియల్ సర్వే నిర్వహించారు. గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డకు రాహుల్ చేరుకున్నారు. ఇటీవలే కుంగిపోయిన లక్ష్మీ బ్యారేజీని ఆయన పరిశీలించారు. ఇదే సమయంలో బ్యారేజీ పరిశీలనకు పోలీసులు ఇతరులకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలను బ్యారేజీ వద్దకు వెళ్లకుండా అడ్డుకునేందుకు బారికేడ్లు సిద్ధం చేశారు. రూ. లక్ష కోట్లతో కట్టిన బ్యారేజీ రెండేళ్లకే దెబ్బతినడం దారుణమని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణంలో జరిగిన అక్రమాల వల్లే ఈ దుస్థితి దాపురించిందన్నారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టు నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని రాహుల్ విమర్శించారు.

Details

ప్రాజెక్టులో దోపీడిని చూసేందుకే వచ్చా : రాహుల్

మరోవైపు ప్రధాని మోదీ, అమిత్‌షా, తెలంగాణలో జరిగిన కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో దోపిడీ చూసేందుకే ఇక్కడికి వచ్చానని రాహుల్ అన్నారు. అంతకుముందు మేడిగడ్డ అంబటిపల్లిలో జరిగిన మహిళా సదస్సులో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్లలో దాదాపుగా లక్ష కోట్లు దోచుకున్నారని రాహుల్ పునరుద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్‌ పార్టీకి, కేసీఆర్ సహా ఆయన కుటుంబ సభ్యులకు ఏటీఎంలా మారిందన్నారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ దోచుకోవడంతో మహిళలే తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకవైపు, కాంగ్రెస్ మరో వైపు ఉందని రాహుల్ స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 మేడిగడ్డకు రాహుల్‌ గాంధీ