Page Loader
లోక్‌సభలో అనూహ్య పరిణామం.. రాహుల్ గాంధీ ప్లయింగ్ కిస్ పై కేంద్ర మంత్రి స్మృతి తీవ్ర ఆగ్రహం 
రాహుల్ గాంధీ ప్లయింగ్ కిస్ పై స్మృతి ఇరానీ మండిపాటు

లోక్‌సభలో అనూహ్య పరిణామం.. రాహుల్ గాంధీ ప్లయింగ్ కిస్ పై కేంద్ర మంత్రి స్మృతి తీవ్ర ఆగ్రహం 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 09, 2023
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభలో బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రవర్తనపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాజస్థాన్ లో జరుగుతున్న ఓ సమావేశంలో పాల్గొనేందుకు సిద్ధమైన రాహుల్, అవిశ్వాసంపై మాట్లాడకుండానే సభ నుంచి నిష్క్రమించాడు. ఈ సమయంలో మహిళా సభ్యులు కూర్చున్న వైపున ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన మంత్రి స్మృతి, రాహుల్ అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు. మాట్లాడేందుకు అవకాశమిచ్చినా బయటకు వెళ్లే క్రమంలో అనుచితంగా వ్యవహరించాడన్నారు. మహిళా ఎంపీలు కూర్చున్న సభకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.స్త్రీ ద్వేషపూరిత వ్యక్తి మాత్రమే అలా చేస్తాడన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి అసభ్యకరమైన ప్రవర్తన చూడలేదనని మండిపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాహుల్ చర్యను తీవ్రంగా ఖండించిన కేంద్రమంత్రి  

DETAILS

ఫ్లయింగ్‌ కిస్‌ పై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు 

ఈ అంశంపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఆధ్వర్యంలో మహిళా ఎంపీలు సంతకాలు చేసిన లేఖ ద్వారా స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగం పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ లోక్‌సభ నుంచి నిష్క్రమించే క్రమంలో ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారంటూ భాజపా మహిళా ఎంపీలు మండిపడ్డారు. మహిళల గురించి రాహుల్ ఏం ఆలోచిస్తున్నారో ఈ ప్రవర్తనే చెబుతోందని కేంద్రమంత్రి స్మృతి అన్నారు. ఇది అసభ్యకరమైందని తప్పుబట్టారు.