
అవిశ్వాస తీర్మానంపై నేడు రాహుల్ గాంధీ కీలక ప్రసంగం.. ఉత్కంఠగా మారనున్న సభాపర్వం
ఈ వార్తాకథనం ఏంటి
విపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లడనున్నారు.
మోషన్‌పై చర్చ అనంతరం ఇదే రోజు రాజస్థాన్‌లో జరిగే ర్యాలీలో ప్రసంగించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
అవిశ్వాస తీర్మానం మధ్యాహ్నానికి మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌కు రాహుల్ గాంధీకి బదులుగా ప్రియాంక గాంధీ వెళ్లేందుకు పార్టీ నిర్ణయించింది.
ఆగస్ట్ 10 వరకు అవిశ్వాసంపై చర్చలు కొనసాగనున్నాయి. అదే రోజు తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇచ్చే అవకాశం ఉంది.
లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గౌరవ్ గొగోయ్ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
details
రాహుల్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన కొందరు ముఖ్య నేతలు చర్చలో భాగంగా తొలుత మాట్లాడిన తర్వాతే తాను మాట్లాడాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఆఖరి నిమిషంలో రాహుల్ వైదొలగడం వ్యూహంలో భాగమేనని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు రాహుల్ చర్చను ప్రారంభించరని స్పీకర్‌కు చెప్పగా, ఎందుకు ఆయన చర్చను ప్రారంభించట్లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరా తీశారు.
అందరికంటే ముందే రాహుల్ మాట్లాడి ఉంటే ఆయనపై అధికార పక్షం మాటాల తూటాలు పేలకుండా ఉండేందుకే నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం.
పరువు నష్టం దావా కేసులో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత రాహుల్ గాంధీ మళ్లీ లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. ఈ మేరకు పార్లమెంట్ వేదికగా రాహుల్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.