
Vinesh Phogat: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. రాహుల్ ని కలిసిన వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా
ఈ వార్తాకథనం ఏంటి
అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడటంతో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ కల చెదిరింది. ఈ పరిణామం తరువాత, ఆమె కుస్తీకి వీడ్కోలు పలికింది.
దీంతో ఆమె భవిష్యత్తు ప్రయాణం ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందులో భాగంగా, ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా, ఆమె కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం ఇచ్చింది.
బుధవారం ఉదయం, రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.
ఆ ఫోటోను కాంగ్రెస్ పార్టీ తమ 'ఎక్స్' ఖాతాలో షేర్ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్
नेता विपक्ष श्री @RahulGandhi से विनेश फोगाट जी और बजरंग पुनिया जी ने मुलाकात की। pic.twitter.com/UK7HW6kLEL
— Congress (@INCIndia) September 4, 2024
వివరాలు
వినేశ్ ఫొగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం
రాహుల్ గాంధీని ఎందుకు కలిసారన్న వివరాలు తెలియకపోయినా, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఫొగాట్,పునియా ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వినేశ్ ఫొగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు గత కొంతకాలంగా చర్చకు దిగాయి.
ఇటీవల, ఆమె ఒలింపిక్స్ ముగించుకొని స్వదేశానికి చేరుకున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా ఆమెను స్వాగతించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాజ్యసభకు వినేశ్‌ను పంపాలని కొంతమంది కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల గురించి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం సమావేశమైంది.
వివరాలు
పునియాకు టికెట్ ఇచ్చే అవకాశాలు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై చర్చించి 34 మందిని ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
నేడు లేదా రేపు అధికారిక అభ్యర్థుల జాబితా ప్రకటించబోతున్నారు.ఈ సమయంలో పునియా-వినేశ్-రాహుల్ భేటీ కావడం గమనార్హం.
ఆమెను అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.పునియాకు కూడా టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
వివరాలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఫొగాట్ సిస్టర్స్ పోరు
మునుపటి హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు,వినేశ్ సోదరి బబితా 2019లో బీజేపీలో చేరింది. ఆ ఎన్నికల్లో,దాద్రి స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది.
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, ఆమెకు మరోసారి కమలం పార్టీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు,అదే స్థానం నుంచి వినేశ్‌ను కాంగ్రెస్ పోటీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం.
ఈసారి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫొగాట్ సిస్టర్స్ పోరు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారవచ్చు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 5న జరుగనున్నాయి.