
పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్‌పై అనర్హత వేటు పడింది. ఫలితంగా లోక్‌సభ సభ్యత్వం(ఎంపీ పదవి) కోల్పోయారు.
ఈ కేసు స్టే విధించాలని గుజరాత్ హైకోర్టును రాహుల్ ఆశ్రయించగా, అక్కడ కూడా అయనకు ఊరట లభించలేదు.
దీంతో రాహుల్ స్టే కోసం చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
DETAILS
గత బుధవారమే సుప్రీంకోర్టులో పూర్ణేష్ మోదీ కేవియట్ దాఖలు
ఇదిలా ఉంటే, రాహుల్‌పై కేసు వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సుప్రీంలో కేవియట్ దాఖలు చేశారు.
గుజరాత్ హైకోర్టు తీర్పు ఆధారంగా రాహుల్ అప్పీల్‌ను విచారించాలని సుప్రీంకోర్టును కోరారు. రాహుల్ పిటిషన్‌పై విచారణ చేపడితే తన వాదనలను సైతం వినాలని పూర్ణేష్ మోదీ కేవియట్‌లో కోరారు.
2019 కర్ణాటకలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ఇంటిపేరును ఉద్దేశించి రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పూర్ణేష్ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
ఈ క్రమంలో మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్‌ను దోషిగా పేర్కొంటూ రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.