ఫ్లయింగ్ కిస్ వివాదం.. రాహుల్ గాంధీకి మద్ధతుగా నిలిచిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
పార్లమెంట్‌లో బుధవారం జరిగిన ఫ్లయింగ్ కిస్ వివాదంపై మహిళా ఎంపీ రాహుల్ గాంధీకి మద్ధతుగా నిలిచారు. శివసేన (UBT)కి చెందిన ప్రియాంక చతుర్వేది సంఘీభావం ప్రకటించారు. రాహుల్ ఆప్యాయంగా, ప్రేమపూర్వకంగా ప్రవర్తించారని ప్రియాంక వెనకేసుకొచ్చారు. ఫ్లయింగ్ కిస్ ద్వారా రాహుల్ ప్రేమను వ్యక్తం చేశారని, దాంతో మీకేం ఇబ్బందని బీజేపీ మహిళా ఎంపీలను ఉద్దేశించి ప్రశ్నించారు. అర్థం చేసుకోలేని వారికి, ప్రేమే ద్వేషంగా కనిపిస్తుందన్నారు. ప్రేమ, ఆప్యాయతలకు సంబంధించి చేసిన సంజ్ఞలు మీకు(బీజేపీకి) మరోలా కనిపిస్తుందని ప్రియాంక ఎద్దేవా చేశారు. రాహుల్ ఆప్యాయంగా సంజ్ఞ చేశారని, దానికే అపార్థాలుస పెడ అర్థాలు తీసుకుంటే ఎలా అని నిలదీశారు. మీకేమైనా సమస్య ఉంటే అది మీ సమస్యే తప్ప మరెవరిది కాదని తేల్చి చెప్పారు.