గుజరాత్‌లో తప్పిన రైలు ప్రమాదం.. పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలు
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్‌లో పెను రైలు ప్రమాదం తప్పినట్టైంది. కొందరు దుండగులు పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలను వేశారు. ఈ మేరకు రైలును, పట్టాలు తప్పించేందుకు కుట్ర చేశారు.
ఇనుప స్తంభాన్ని గమనించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై రైలు ప్రమాదం జరగకుండా సడెన్ బ్రేక్స్ వేశారు. ఆదివారం రాత్రి వడోదరలోని వర్ణ-ఇటోలా రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.
పట్టాలపై స్తంభాన్ని గుర్తించని ఓఖా-షాలీమార్ రైలు లోకో పైలెట్ వాటిని ఢీకొట్టుకుంటూనే వెళ్లిపోయింది. కాసేపటికే అదే దారిలో పరుగులు పెడుతున్న అహ్మదాబాద్- పూరీ రైలు లోకోపైలట్ పట్టాలపై స్తంభాన్ని పసిగట్టారు.
అనంతరం రైలును నిలుపుదల చేసిన లోకోపైలట్, రైల్వే అధికారులకు సమాచారం అందించారు.ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
DETAILS
ఇనుప స్తంభాన్ని గుర్తించి స్టేషన్ మాస్టర్ కు సమాచారం ఇచ్చిన లోకోపైలెట్
రైళ్లను పట్టాలు తప్పించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు కుట్ర పన్నారని అధికారులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అంతకుముందే స్తంభాలను గమనించకుండా, వాట్ని దాటుకుంటూ వెళ్లిన రైలుకు అదృష్టవశాత్తు ఏం కాకపోవడం విశేషం.
అయితే అదే సమయంలో అహ్మదాబాద్-పూరీ రైలు లోకో-పైలట్ స్తంభాలను గమనించి హుటాహుటిన ఇటోలా రైల్వే స్టేషన్ మాస్టర్‌కు సమచారాన్ని చేరవేశారు.
అనంతరం స్టేషన్ మాస్టర్, కంట్రోల్ రూముకు సమాచారాన్ని అందించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన రైల్వేశాఖ, వెంటనే అధికారులను, పోలీసులను అలెర్ట్ చేసింది.
ఇప్పటికే ఈ ఏడాది జరిగిన వరుస రైలు ప్రమాదాలపై రైల్వే ప్రయాణికులు బెంబెలిత్తిపోతున్నారు. తరచుగా రైళ్లు ప్రమాదానికి గురవడం కలవరానికి గురిచేస్తోంది.