LOADING...
మధురై రైల్లో ఘోరం.. అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి, మరింత పెరిగే అవకాశం
అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి

మధురై రైల్లో ఘోరం.. అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి, మరింత పెరిగే అవకాశం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 26, 2023
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో రైలు ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. శనివారం మధురై రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఆధ్యాత్మిక పర్యాటక రైలు ప్రమాదంలో (భారత్ గౌరవ్) 9 మంది దుర్మరణం పాలయ్యారు. రైలు బోగీలోని ప్యాంట్రీ కారు(PANTRY CAR)లో వంట చేస్తుండగా సిలిండర్ పేలినట్లు తెలుస్తోంది.గాలి వేగంగా, రైలు కోచ్‌ల్లోకి చేరడంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి.ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. 15 రోజుల పర్యటన కోసం లక్నో నుంచి బయలుదేరిన రైలు మధురై సమీపంలో నిలిచిపోయింది. ప్రమాద సమయంలో 63 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. ఇప్పటికే 20 మందికిపైగా గాయాలు కాగా నలుగురు తీవ్రంగా గాయపడ్డట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనపై విచారణ కొనసాగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తమిళనాడులో ఘోర రైలు అగ్ని ప్రమాదం

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాలి బూడిదైన రైలు బోగీలు