
Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మంటలు
ఈ వార్తాకథనం ఏంటి
ముంబై-బెంగళూరు మధ్య నడిచే ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి.
బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (కెఎస్‌ఆర్) రైల్వే స్టేషన్‌లో ఉద్యాన్ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు, మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి.
ముంబై నుంచి బెంగళూరు స్టేషన్ మధ్య ఈ రైలు నడుస్తుంది. దీనికి కేఎస్ఆర్ స్టేషన్ చివరి స్టాప్.
ప్రయాణికులు రైలు దిగిన రెండు గంటల తర్వాత అగ్నిప్రమాదం జరిగిందని సౌత్ వెస్ట్రన్ రైల్వే వెల్లడించింది.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది, నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అగ్నిప్రమాదంలో రైల్వే స్టేషన్‌ను కమ్మేసిన పొగ
#WATCH | Bengaluru, Karnataka: Fire broke out in Udyan Express after it reached Sangolli Rayanna Railway Station. The incident happened 2 hours after passengers deboarded the train. No casualties or injuries. Fire engine and experts reached the spot and asserting the situation.… pic.twitter.com/eo5HTjNz2X
— Argus News (@ArgusNews_in) August 19, 2023
తెలంగాణ
తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లోనూ మంటలు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో కూడా శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఎస్-2 బోగీలో మంటలు ఒక్కసారిగా రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వై సిబ్బంది రైలును నాగ పూర్ సమీపంలో నిలిపేశారు.
దీంతో ప్రయాణికులు భయాందోళనతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.
ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఒకేరోజు రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రమాదం జరగడంతో రైల్వేశాఖ దీన్ని సీరియస్‌గా పరిగణిస్తోంది.