
వందే భారత్: రైలు రంగు ఆరెంజ్ కలర్ లో ఎందుకుందో వెల్లడి చేసిన రైల్వే మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24వ తేదీన 9వందే భారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలో కాసర్గడ్ నుండి తిరువనంతపురం వరకు కొత్తగా వందే భారత్ రైలు ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ రైలు రంగు విషయంలో అనేక కామెంట్లు వస్తున్నాయి. ఆ రైలు రంగు ఆరంజ్ కలర్ లో ఉండటమే కామెంట్లకు కారణం.
ప్రస్తుతం ఆరెంజ్ కలర్ విషయమై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.
రైలుకు ఆరెంజ్ రంగు ఎందుకనే విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు, సైంటిఫిక్ గా ఆలోచించి రైలు రంగును ఆరెంజ్ కలర్ లో ఉంచామని ఆయన చెప్పుకొచ్చారు.
Details
ఆరెంజ్ కలర్ తొందరగా కనిపిస్తుందంటున్న రైల్వే మంత్రి
సాధారణంగా ఆరెంజ్, పసుపు రంగులు మాత్రమే దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్లే వందే భారత్ రైలుకు ఆరెంజ్ రంగును ఎంచుకోవడం జరిగింది.
అంతే తప్ప ఈ విషయంలో ఎలాంటి రాజకీయ అంశం ముడిపడి లేదని, కేవలం సైంటిఫిక్ గా ఆలోచించి ఆరెంజ్ రంగును ఎంచుకున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
అంతేకాదు ఆయన మాట్లాడుతూ, విమానంలో, ఓడల్లో బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ రంగులో ఉంటుందని, లైఫ్ జాకెట్లు కూడా ఆరెంజ్ రంగులోనే ఉంటాయని ఆయన అన్నారు.
లైఫ్ బోట్స్ రంగు కూడా నారింజ రంగులోనే ఉంటుందని.. ఇవన్నీ కేవలం తొందరగా కనిపించాలని ఉద్దేశంతోనే ఆ రంగును ఎంచుకున్నారని, ఆ ఆలోచనతోనే ఆరెంజ్ రంగును ఎంచుకున్నామని ఆయన తెలియజేశారు.