LOADING...
Railways: రైల్వేల ప్రైవేటీకరణ ఆచరణీయం కాదు: రైల్వే బోర్డ్ మాజీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
రైల్వే బోర్డ్ మాజీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Railways: రైల్వేల ప్రైవేటీకరణ ఆచరణీయం కాదు: రైల్వే బోర్డ్ మాజీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో భారత్ ఎప్పుడూ అగ్రస్థానాల్లో ఉంటుంది. లక్షల కిలోమీటర్ల పొడవైన ట్రాక్‌లు,వేల సంఖ్యలో రోజూ నడిచే రైళ్లు.. ఈ అన్ని వనరుల ద్వారా కోట్లాది ప్రయాణికులు నిరంతరం సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం రైల్వేలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తున్నాయి. అయితే, గతంలో పెట్టుబడుల భారాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా రైల్వేలను ప్రైవేట్ రంగానికి అప్పగించాలనే ఆలోచన కేంద్రం పరిశీలిస్తోందన్న వార్తలు వచ్చాయి. ఆ ప్రతిపాదన ఆచరణలోకి రాలేదు కానీ, ఇప్పుడు అదే విషయం మళ్లీ చర్చకు వచ్చింది.

వివరాలు 

చింతన్ రిసెర్చ్ ఫౌండేషన్ (CRF) నిర్వహించిన 'రైల్వే కాన్‌క్లేవ్ 2.0' కార్యక్రమం

రైల్వే బోర్డు మాజీ సభ్యుడు ఎం. జంషెడ్ ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ, భారత రైల్వేలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికీ అత్యంత కీలకమైన రంగమని, దాన్ని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇవ్వడం సరైన నిర్ణయం కాదని చెప్పారు. రైల్వేలను ప్రైవేటీకరిస్తారన్న వార్తలను ఆయన ఖండించారు. చింతన్ రిసెర్చ్ ఫౌండేషన్ (CRF) నిర్వహించిన 'రైల్వే కాన్‌క్లేవ్ 2.0' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఎం. జంషెడ్ రైల్వేల ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడారు. 'రైల్వే ప్రైవేటీకరణలో అవకాశాలు, సవాళ్లు' అనే ప్రధాన అంశంతో ఈ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పలు సంవత్సరాలుగా ఈ విషయంపై స్పష్టత ఇస్తున్నప్పటికీ, రైల్వేల్లో ప్రైవేటీకరణపై చర్చ మాత్రం నిరంతరం కొనసాగుతుందన్నారు.

వివరాలు 

రైల్వేలను ప్రైవేటీకరించే ఉద్దేశం లేదు: రైల్వే మంత్రులు 

సురేశ్ ప్రభు, పీయూష్ గోయెల్, అశ్విని వైష్ణవ్ వంటి రైల్వే మంత్రులు కూడా పార్లమెంట్‌లోనే రైల్వేలను ప్రైవేటీకరించే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పూర్తిస్థాయి ప్రైవేటీకరణ, ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం.. ఈ రెండింటి మధ్య తేడాను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వివిధ రంగాల్లో గతంలో ప్రైవేట్ భాగస్వామ్యం ఉపయోగించిన ఉదాహరణలు ఉన్నప్పటికీ, రైల్వేలను పూర్తిగా ప్రైవేటీకరించడం సాధ్యపడేది కాదు, అవసరమూ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పౌర విమానయానం లేదా చాలా పీఎస్‌యూలు ప్రైవేట్ ఆపరేటర్లకు అద్దెకు ఇచ్చిన హైవేల మాదిరిగా కాకుండా, భారత రైల్వేలు భారత ప్రభుత్వానికి చెందిన విభాగంగా నడుస్తాయని ఎం. జంషెడ్ వివరించారు.

వివరాలు 

క్రాస్-సబ్సిడీ సుమారు ₹60,000 కోట్ల వరకు..

ఈ సంస్థకు వాణిజ్య పరంగా లాభదాయకమైన కార్యకలాపాలు నిర్వహించాల్సిన బాధ్యతతో పాటు, దేశ పౌరులకు సేవ చేసే సామాజిక బాధ్యత కూడా ఉంటుందని చెప్పారు. ప్రయాణీకుల రవాణాలో వచ్చే వార్షిక నష్టాలను రైల్వేలు సరుకు రవాణా ఆదాయం ద్వారా తీరుస్తాయని, అలాగే ఆ క్రాస్-సబ్సిడీ సుమారు ₹60,000 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. గత పది సంవత్సరాల్లో రైల్వేలు సాధించిన పురోగతిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. బడ్జెట్ ద్వారా వచ్చే మద్దతు గతంలో ₹20,000-30,000 కోట్ల మధ్య ఉండగా, ఇప్పుడు అది ₹2.5 లక్షల కోట్లు చేరిందని వివరించారు. 2004-2014 కాలంలో మూలధన వ్యయం ₹3 లక్షల కోట్లు కాగా, ఆ తర్వాతి దశాబ్దంలో అది ₹17 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు.

వివరాలు 

సరుకు రవాణా కూడా 12,000 మిలియన్ టన్నులకుపైగా వృద్ధి

సరుకు రవాణా కూడా 12,000 మిలియన్ టన్నులకుపైగా వృద్ధి చెందిందని చెప్పారు. రైల్వే ప్రైవేటీకరణపై చర్చలు కొత్తవి కావని, దశాబ్దాల క్రితమే ఈ అంశంపై కమిటీలు కూడా అభిప్రాయాలు వెల్లడించాయని జంషెడ్ పేర్కొన్నారు. పునర్నిర్మాణ సూచనలు, ప్రైవేట్ రైళ్ల ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, జాతీయ భద్రత, ఆర్థిక భారాలు, సామాజిక బాధ్యతలు, విస్తృత స్థాయి కార్యకలాపాల నిర్వహణ వంటి అంశాల వల్ల పూర్తి ప్రైవేటీకరణ అమలు కాలేదన్నారు. అందుచేత ప్రభుత్వాలు ఎంచుకున్న కొన్ని విభాగాల్లో మాత్రమే నియంత్రిత ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతిస్తున్నాయని ఆయన తెలిపారు.