Page Loader
Weather Update: దక్షిణ, ఈశాన్య, తూర్పు భారతంలో భారీ వర్షాలు.. ఉత్తరాన మాత్రం హీట్​వేవ్​.. 
దక్షిణ, ఈశాన్య, తూర్పు భారతంలో భారీ వర్షాలు.. ఉత్తరాన మాత్రం హీట్​వేవ్​..

Weather Update: దక్షిణ, ఈశాన్య, తూర్పు భారతంలో భారీ వర్షాలు.. ఉత్తరాన మాత్రం హీట్​వేవ్​.. 

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2025
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే వారం రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మే 24 వరకు తూర్పు తీర ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ విడుదల చేసిన తాజా సూచనలో పేర్కొంది. వర్షాలకు తడిసిపోయే రాష్ట్రాలు ఇవే... ఐఎండీ ప్రకారం, మే 18 నుంచి 24 తేదీల మధ్య కర్ణాటక, కొంకణ్, గోవా, కేరళ సహా పశ్చిమ తీర ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడే అవకాశముండడంతో, స్థానిక స్థాయిలో తేలికపాటి వరదల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

వివరాలు 

దక్షిణ రాష్ట్రాల్లో వానల అంచనాలు 

ఈ నేపథ్యంలో రాబోయే 5-6 రోజుల్లో ఈశాన్య భారతదేశం,సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు,మెరుపులు సహా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇంకా గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, దీని వల్ల చెట్లు విరిగిపడే ప్రమాదమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 18 నుంచి 20 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అదే విధంగా, మే 18 నుంచి 24 వరకు కేరళ, మాహే, కోస్తా కర్ణాటక, ఉత్తర అంతర్గత కర్ణాటకలో వర్షాలు పడతాయి.

వివరాలు 

దక్షిణ రాష్ట్రాల్లో వానల అంచనాలు 

మే 20 నుంచి 22 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మే 18 నుంచి 20 వరకు రాయలసీమలో వర్షాలు పడతాయి. అలాగే, మే 18 నుంచి 21 వరకు దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో, మే 20 నుంచి 22 మధ్య కోస్తా కర్ణాటక, మే 18 నుంచి 20 వరకు దక్షిణ అంతర్గత కర్ణాటక, మే 19 నుంచి 22 వరకు ఉత్తర అంతర్గత కర్ణాటకలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మే 20న కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.

వివరాలు 

మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లో పరిస్థితి 

మే 20 నుంచి 23 మధ్యకాలంలో కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర,మరాఠ్వాడా ప్రాంతాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మే 20 వరకు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మే 24 వరకు అసోం, మేఘాలయ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని సూచించింది. మే 19, 20 తేదీలలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే, జమ్మూ కశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.

వివరాలు 

ఉత్తరాదిన హీట్‌వేవ్ హెచ్చరిక 

తాజా ఐఎండీ బులెటిన్ ప్రకారం, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మే 22 వరకు తీవ్రమైన వేడిగాలులు (హీట్‌వేవ్) కారణంగా తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశముందని హెచ్చరించింది.