Rains : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. 26న బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన నెలకొంది. ఈనెల 26న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ వెల్లడించింది. బుధవారం తూర్పు గాలులలోని కొమరెన్ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటున సముద్ర మట్టం నుంచి 3.1 కిమీ ఎత్తు వరకు వ్యాపించిన ద్రోణి బలహీనపడింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపుకి వీస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రభావంతో నేటి నుంచి వచ్చే రెండు రోజులు తెలంగాణాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం
ఇదే సమయంలో హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం కానుంది. ఉదయం వేళల్లో నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ వాతావరణం తమిళనాడు, సరిహద్దు ప్రాంతం కేరళలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. సముద్ర మట్టానికి సగటున 3.1 కిమీ ఎత్తులో విస్తరించింది. ఈనెల 25లోగా దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 26 వరకు అల్పపీడనం ఏర్పడనుంది. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉరుములతో కూడిన జల్లులు పలు చోట్ల పడే అవకాశం ఉందవి అమరావతి ఐఎండీ వెల్లడించింది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది.