Page Loader
TG Weather: తెలంగాణలో రాగల రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండీ వార్నింగ్‌
తెలంగాణలో రాగల రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం..

TG Weather: తెలంగాణలో రాగల రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండీ వార్నింగ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2025
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులు,ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. శనివారం వర్ష సూచన గల జిల్లాలు: శనివారం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

వివరాలు 

ఆదివారం వానలు కురిసే ప్రాంతాలు: 

ఆదివారం రోజున రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. గడిచిన 24 గంటల వర్షపాతం వివరాలు: ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో హైదరాబాద్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతంలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.