LOADING...
Weather Updates: ఉరుములు-మెరుపులతో వర్ష సూచన.. తెలంగాణలో ఎల్లో అలర్ట్!
ఉరుములు-మెరుపులతో వర్ష సూచన.. తెలంగాణలో ఎల్లో అలర్ట్!

Weather Updates: ఉరుములు-మెరుపులతో వర్ష సూచన.. తెలంగాణలో ఎల్లో అలర్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2025
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో గత మూడు నుంచి నాలుగు రోజులుగా పొడి వాతావరణం కొనసాగుతుండగా ఇక నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు తెలిపారు.

Details

 నగరవాసులకు కొంత ఉపశమనం

ఈ జిల్లాల్లో ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులు సహా వర్షం కురిసే అవకాశం ఉందని, గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని వాతావరణ శాఖ వివరించింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వడగళ్ల తాకిడితో వడదెబ్బలతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలు వర్షం అనంతరం ఊపిరి పీల్చుకున్నారు. అయితే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.