Page Loader
IMD Weather : తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

IMD Weather : తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 22, 2024
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం మరో అప్డేట్ ప్రకటించింది. వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ- బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఈ ప్రాంతమంతా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

Details

తెలంగాణ పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

తెలంగాణలోని మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదశ్ లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, నెల్లూరు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశంతో సహా వివిధ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, నంద్యాల, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయిలో తేలికపాటి వర్షాలు పడనున్నాయి.