
Heavy Rains: ఢిల్లీలో వర్ష భీభత్సం.. వందకు పైగా విమానాలు రద్దు, నగరమంతా జలమయం
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీపై వర్షాలు విరుచుకుపడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున మొదలైన భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
వర్షానికి తోడు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షం ధాటికి ప్రధాన రహదారి మార్గాల్లో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఢిల్లీకి 'రెడ్ అలర్ట్' జారీ చేసింది.
Details
విమాన సర్వీసులకు షాక్
భారీ వర్షాల ప్రభావం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా పడింది. వర్షం కారణంగా 100కి పైగా విమానాల సేవలు నిలిచిపోయాయి.
అలాగే 25కి పైగా విమానాలు ఇతర ఎయిర్‌పోర్టులకు దారి మళ్లించారు.
ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ విమానయాన సంస్థల్ని సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు.
వర్షపాతం వివరాలు
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
మింటో రోడ్డులో నీటి మునుగుడుతో ఒక కారు పూర్తిగా నీటిలో మునిగిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Details
వాతావరణ శాఖ హెచ్చరిక
ఢిల్లీతో పాటు పరిసర రాష్ట్రాల్లో 60 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని ఐఎండీ (భారత వాతావరణ శాఖ) హెచ్చరించింది.
ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రాంతాల వారీగా నమోదైన వర్షపాతం
సఫ్దర్‌జంగ్: 81 మిల్లీమీటర్లు
పాలం: 68 మిల్లీమీటర్లు
పూసా: 71 మిల్లీమీటర్లు
మయూర్ విహార్: 48 మిల్లీమీటర్లు
ఈ విధంగా వర్షం ఢిల్లీ జీవనరిత్యిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరిన్ని అవాంఛనీయ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.