Telangana,Ap Rains: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వానలే వానలు.. ఎన్ని రోజులో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాలకు భారతీయ వాతావరణ కేంద్రం కూల్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రానున్న 4 రోజుల పాటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురవనున్నాయి.
ఈ మేరకు ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.ఈ కారణంగానే దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్నాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులు,ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
details
ద్రోణి ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఈ మేరకు రానున్న 4 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి.
వచ్చే 3 రోజులు :
హైదరాబాద్, మహబూబ్ నగర్, వికారాబాద్,నల్గొండ, నారాయణపేట, సూర్యాపేట, కొత్తగూడెం, ములుగు,వరంగల్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో వానలు పడనున్నాయి.
మరోవైపు హైదరాబాద్‌లో మంగళవారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఏపీ వర్షాలు :
ఏపీలోనూ ద్రోణి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణం విభాగం అంచనా వేసింది.
అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పగో, ఏలూరు,కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్‌ఆర్, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు కురవనుంది.