తెలంగాణ : నేటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు
రాగల రెండు రోజులు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) ప్రకటించింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడనన్నట్లు వెల్లడించింది. అక్టోబర్ తొలి వారంలోనే నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలవుతుందని పేర్కొంది. హైదరాబాద్ మహానగరంతో పాటు జిల్లాల్లోనూ సెప్టెంబర్ చివరి వరకు సాధారణ వర్షపాతమే ఉంటుందని తెలిపింది. సోమవారం,మంగళవారాల్లో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట సహా ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు అంచనా వేసింది. మరోవైపు భారతదేశంలో సాధారణ సగటు వర్షపాతం 832.4 మి.మీ కాగా, ఈసారి కేవలం 780.3 మి.మీ మాత్రమే కురిసినట్లు భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.