Page Loader
Rajasthan: జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు-ట్రక్కు ఢీ; 11మంది మృతి 
జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు-ట్రక్కు ఢీ; 11మంది మృతి

Rajasthan: జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు-ట్రక్కు ఢీ; 11మంది మృతి 

వ్రాసిన వారు Stalin
Sep 13, 2023
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లోని జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. బస్సు రాజస్థాన్‌లోని పుష్కర్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్‌కు వెళ్తుండగా తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇంధనం అయిపోవడంతో బస్సును హైవేపై డ్రైవర్ నిలిపివేశారు. ఇదే సమయంలో ట్రక్కు వేగంగా వచ్చి బలంగా ఢీకొన్న నేపథ్యంలో ప్రాణనష్టం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. బస్సు డ్రైవర్, కొంతమంది ప్రయాణికులు బస్సు బయట నిలబడి ఉండటంతో వారికి ప్రాణాపాయం తప్పింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స