Page Loader
Rajasthan Elections 2023: ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే 
Rajasthan Elections 2023: ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Rajasthan Elections 2023: ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2023
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు,కాంగ్రెస్ ఎమ్మెల్యే గిర్రాజ్ మలింగ ఆదివారం జైపూర్‌లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన బారీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.రాబోయే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన 21 మంది అభ్యర్థులతో ఏడవ జాబితాను విడుదల చేయడానికి కొన్ని గంటల ముందు అయన బీజేపీలో చేరారు. అంతకముందు కాంగ్రెస్ మలింగకు టిక్కెట్ నిరాకరించింది.ధోల్పూర్ జిల్లాలోని బారి నుండి ప్రశాంత్ సింగ్ పర్మార్‌ను పోటీకి దింపింది. అనేక దళిత సంఘాలు మలింగ బీజేపీలోకి రావడాన్ని ఖండించాయి.రాజస్థాన్‌లో దళితుల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తమ నినాదం కేవలం "ఎన్నికల జిమ్మిక్" అని బీజేపీ పార్టీ నిరూపించిందని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.

Details 

గతేడాది మలింగతో పాటు ఇతరులపై కేసు

గత సంవత్సరం,విద్యుత్ శాఖకు చెందిన ఇద్దరు ఇంజనీర్లపై మలింగ దాడి చేశారు. వారిలో ఒకరు దళితుడు. దళిత వర్గానికి చెందిన ఇంజనీర్ జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తర్వాత గతేడాది మార్చిలో మలింగతో పాటు ఇతరులపై కేసు నమోదైంది. జైపూర్‌లోని పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయిన మలింగను అరెస్టు చేసినట్లు పిటిఐ నివేదించింది. బీజేపీలో చేరిన తర్వాత, కాంగ్రెస్‌లో తనను వేధిస్తున్నారని, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ "ఒత్తిడి రాజకీయాల" కారణంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని మలింగ ఆరోపించారు.

Details 

బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరాను:  మలింగ 

ఇంజినీర్ల దాడి కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తనను నిందితుడిగా చేర్చడంలో కూడా రాజకీయం కోణం ఉందన్నారు. దర్యాప్తు అధికారిని మార్చాలని నేను డిమాండ్‌ చేసినా ముఖ్యమంత్రి నా మాట వినలేదని అయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను చూసి, బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలనే తపనతో బీజేపీలో చేరానని తెలిపారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని రుజువు చేసిందని,దళితులపై అఘాయిత్యాలతో సంబంధం ఉన్న వ్యక్తులను (పార్టీలోకి) స్వాగతిస్తూ కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం దళిత సమస్యలను ఉపయోగిస్తోందని భన్వర్ మేఘవాన్సీ అనే దళిత కార్యకర్త అన్నారు.

Details 

బీజేపీ చేసిన నినాదం కేవలం ఎన్నికలేనని జిమ్మిక్: సత్యవీర్ సింగ్

షెడ్యూల్డ్ కులాల హక్కుల ప్రచార సమన్వయకర్త సత్యవీర్ సింగ్ మాట్లాడుతూ.. దళితులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బారీ ఎమ్మెల్యే గిర్‌రాజ్‌సింగ్‌ మలింగను బీజేపీలోకి తీసుకురావడం ద్వారా రాజస్థాన్‌లో దళితులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన నినాదం కేవలం ఎన్నికలేనని జిమ్మిక్ అని రుజువైందన్నారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న దళితుల అఘాయిత్యాలను అధ్యయనం చేస్తే నిందితుల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాల మద్దతుదారులే దళితులపై అఘాయిత్యాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమవుతుందని ఆ ప్రకటన పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ దళితులకు అనుకూలమైన పార్టీ అని చెప్పుకోలేమని పేర్కొంది.