Page Loader
రాజస్థాన్​లో అమానుషం.. భార్యను వివస్త్రను చేసి ఊరేగించిన భర్త
రాజస్థాన్ : కోడల్ని వివస్త్రను చేసి ఊరేగించిన అత్తింటివారు

రాజస్థాన్​లో అమానుషం.. భార్యను వివస్త్రను చేసి ఊరేగించిన భర్త

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 02, 2023
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్​లో​ అమానుషం చోటుచేసుకుంది. అత్తింటివారు తమ కోడల్ని వివస్త్రను చేసి ఊరేగించిన దారుణ ఘటన ప్రతాప్​గఢ్​ జిల్లాలోని నిచాల్​కోట గ్రామంలో జరిగింది. ఏడాది క్రితమే బాధితురాలికి వివాహం కాగా.. ఆమె అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్లు భర్త అనుమానించాడు. దీంతో సదరు మహిళను, ఆమె భర్త గురువారం సాయంత్రం బలవంతంగా వారి ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెను కొడుతూ వివస్త్రను చేశాడు. వీడియోలు తీస్తూ గ్రామంలో కుటుంబంతో కలిసి ఊరేగించాడు. ఆ వీడియోను చూసిన ​ సీఎం అశోక్​ గహ్లోత్ మండిపడ్డారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఘటనపై బీజేపీ అధ్యక్షుడు నడ్డా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు వర్గ విభేదాల్లో మునిగిపోయి రాష్ట్రాన్ని వదిలేశారని ఎద్దేవా చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజస్థాన్ సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహిళను వివస్త్రను చేసిన వీడియో