
రాజస్థాన్‌లో విద్యార్థుల వరుస బలవన్మరణాలు.. కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లో మరో దారుణం జరిగింది. కోటాలో విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతుండటం కలకలం సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతోన్న ఓ విద్యార్థి బలవన్మరణానికి ఒడిగట్టాడు.
తాజా ఘటనతో ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపుగా 20కిపైగా ఆత్మహత్యలు నమోదయ్యాయి. ప్రస్తుత నెలలో నాలుగో బలవన్మరణం కావడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.
బిహార్‌లోని గయాకు చెందిన 18 ఏళ్ల వాల్మీకి జాంగిడ్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం గతేడాది కోటాలో ఓ శిక్షణ కేంద్రంలో చేరిపోయాడు.
ప్రవేశ పరీక్షకు సన్నద్ధమవుతున్న తరుణంలోనే బాధితుడు మంగళవారం రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లకు కోటా ఇప్పటికే పేరు గాంచింది.
details
ఈ ఏడు ఇప్పటికే 20 మందికిపైగా విద్యార్థుల మరణం
పొరుగు రాష్ట్రాల నుంచే కాక, ఉత్తరాది పలు రాష్ట్రాల నుంచి వేలాది విద్యార్థులు ఏటా ఇక్కడ శిక్షణ తీసుకుంటారు. 2023లో సుమారు 2.5 లక్షల మంది ఉక్కడ శిక్షణ పొందుతున్నట్లు అంచనా.
ఈ నేపథ్యంలోనే విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది 15 మంది విద్యార్థులు చనిపోగా ఈ ఏడు ఆ సంఖ్య 20కి చేరడం ఆందోళనకరం.
గతంలోనూ పదుల సంఖ్యలో ఆత్మహత్యలు జరిగిన దాఖలాలున్నాయి. ఒత్తిడితోనే బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి.
ఆత్మహత్యలను నిరోధించేందుకు రాజస్థాన్ సర్కారు చర్యలు తీసుకుంటున్నా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.ఈ మేరకు కోటాలోని విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లును అందుబాటులోకి తెచ్చారు.