Page Loader
మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 
మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 

వ్రాసిన వారు Stalin
Jun 01, 2023
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్ర పోలీసు బాస్ డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకుంది. త్రిపుర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రాజీవ్ సింగ్‌ని మణిపూర్‌ కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత డీజీపీ పీ. డౌంగెల్‌ను హోం శాఖకు బదిలీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మణిపూర్‌లో చెలరేగిన జాతుల మధ్య ఘర్షణ వల్ల దాదాపు 80మంది మృతి చెందారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు శాఖ నాయకత్వంలో మార్పులకు శ్రీకారం చుట్టింది.

డీజీపీ

రాజీవ్ సింగ్ నియామకం ప్రభుత్వ వ్యూహమేనా?

రాజీవ్ సింగ్ గతంలో సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేశారు. మే 29న కేంద్రం నుంచి మణిపూర్‌కు ఇంటర్-కేడర్ డిప్యుటేషన్‌పై పంపబడ్డారు. మణిపూర్ ప్రభుత్వానికి భద్రతా సలహాదారుగా సీఆర్‌పీఎఫ్ మాజీ చీఫ్ కుల్దీప్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించిన కొద్దిరోజులకు కేంద్రం రాజీవ్ సింగ్‌ను నియమించింది. రాష్ట్రంలో గిరిజనేతర, మైతీయేతర పోలీసులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పోలీస్ కొత్త బాస్‌ను వ్యూహాత్మకంగానే రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికే నేతృత్వంలోని శాంతి కమిటీలో అన్ని రాజకీయ పార్టీలు, కుకీ, మైతీ తెగలకు చెందిన వారు, సామాజిక సంస్థల ప్రతినిధులు ఉంటారు.