NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-China: గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న వేళ.. భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ
    తదుపరి వార్తా కథనం
    India-China: గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న వేళ.. భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ
    గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న వేళ.. భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ

    India-China: గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న వేళ.. భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 14, 2024
    10:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌-చైనా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, డోంగ్‌ జున్‌ త్వరలో సమావేశం కాబోతున్నట్లు సమాచారం.

    సరిహద్దు సమస్యలు, ప్రాంతీయ స్థిరత్వం ఈ చర్చల ముఖ్యాంశాలుగా ఉంటాయని తెలుస్తోంది.

    ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశాలకు అనుబంధంగా వచ్చే వారం ఈ సమావేశం జరగవచ్చని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

    వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) పరిధిలో నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ భారత్‌, చైనా కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

    ఈ ఒప్పందం ప్రకారం, 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వద్ద కొనసాగుతుందని, రెండు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లొచ్చని ఇరు దేశాలు ఒప్పుకున్నాయి.

    వివరాలు 

    20మంది భారత సైనికులు వీరమరణం

    ఈఒప్పందంలో భాగంగా,కీలక ప్రాంతాల నుంచి సైనికులు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామగ్రిని వెనక్కి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తాజాగా వెల్లడించాయి.

    2020 జూన్‌ 15న,తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణ భారత్‌-చైనా సైనికుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

    ఈ ఘర్షణలో,తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు సహా 20మంది భారత సైనికులు వీరమరణం పొందారు.

    చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయినా,ఆ సంఖ్యను ఇంకా వెల్లడించలేదు.చాలా నెలల తర్వాత ఐదు చైనా సైనికులు చనిపోయారని అధికారికంగా అంగీకరించింది.

    ఈ ఘర్షణల కారణంగా ఇరుదేశాలు ఎల్‌ఏసీ వద్ద భారీగా బలగాలను మోహరించాయి.

    అయినప్పటికీ,ఈ గస్తీ ఒప్పందంతో ఈ ఉద్రిక్తతలకు ముగింపు వచ్చాయి.ఈపరిణామాల మధ్య రాజ్‌నాథ్‌ సింగ్‌,డోంగ్‌ జున్‌ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్‌నాథ్ సింగ్
    భారతదేశం
    చైనా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం చైనా
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  రక్షణ శాఖ మంత్రి

    భారతదేశం

    Helicopter:హెలికాప్టర్ సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు  భారతదేశం
    #Newsbytesexplainer: భారత్ "Act East Policy" అంటే ఏమిటి? భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీకి బ్రూనై ఎందుకు కీలకం   బ్రూనై
    Monkeypox: భారత్ లో Mpox అనుమానిత కేసు నమోదు  భారతదేశం
    Financial Times Rankings 2024: టాప్ 100లో 21 భారతీయ సంస్థలకు చోటు  భారతదేశం

    చైనా

    China: చైనీస్ పరిశోధకులు రూపొందించిన  నాలుగు గ్రాముల డ్రోన్‌.. అది ఎప్పటికీ ఎగురుతుంది  టెక్నాలజీ
    India-China Dispute: లడఖ్‌లోని LAC వద్ద దళాలను ఉపసంహరించుకోవడానికి భారతదేశం, చైనా అంగీకారం  సుబ్రమణ్యం జైశంకర్
    USA: చైనాను దెబ్బతీయడానికి రంగంలోకి బీ-2 స్టెల్త్ బాంబర్ అమెరికా
    China investments in India : భారత్​లో చైనా పెట్టుబడులను పెంచేందుకు ప్రణాళికలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025