
Rajya Sabha Elections: జూన్ 19న ఆ 8 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
ఈ వార్తాకథనం ఏంటి
రెండు రాష్ట్రాల్లో ఖాళీ కానున్న ఎనిమిది రాజ్యసభ స్థానాల కోసం వచ్చే నెల 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజున ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.
ఈ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
అసోం రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలు, తమిళనాడు రాష్ట్రంలో ఆరు స్థానాలు ఖాళీ కానున్నాయి.
అసోంలోని ప్రస్తుత రాజ్యసభ సభ్యులు రంజన్ దాస్, బీరేంద్ర ప్రసాద్ బైస్యల పదవీకాలం జూన్ 14న ముగియనుంది.
వివరాలు
జూన్ 2న నోటిఫికేషన్‌ను విడుదల
ఇక తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు అన్బుమణి రామదాస్, ఎం. షణ్ముగం, ఎన్. చంద్రశేగరన్, ఎం. మహ్మద్ అబ్దుల్లా, పీ. విల్సన్, వైకో.
ఈ ఆరుగురి పదవీకాలం జూలై 24న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి జూన్ 2న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
నామినేషన్‌ల దాఖలుకు చివరి తేదీ జూన్ 9గా నిర్ణయించారు. నామినేషన్‌ల పరిశీలన (స్క్రూటినీ)ను జూన్ 10న నిర్వహించనున్నారు.
అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకునే తుది గడువుగా జూన్ 12ను నిర్ణయించారు. అనంతరం జూన్ 19న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ జూన్ 23న పూర్తి కానుంది.