Rakesh Reddy: బీజేపీకి మరో దెబ్బ.. కమలం పార్టీకి రాకేష్ రెడ్డి రాజీనామా
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత వివేక్ ఈ రోజు ఉదయం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనను అనుసరిస్తూ పార్టీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి బిజెపికి గుడ్ బై చెప్పారు. దింతో తెలంగాణ బీజేపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా ఏనాడూ హైకమాండ్ కు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. పార్టీలో ఉన్నన్నాళ్ళు ప్రతికూల పరిస్థితులను తట్టుకొని సమస్యలపై పోరాడానని అన్నారు. బీజేపీలో ప్రజాస్వామ్యం లేదని..ఏదైనా మాట్లాడితే సస్పెండ్ చేస్తారని ఆరోపణలు గుప్పించారు. రాకేష్ వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించగా ఆయనకి నిరాశే ఎదురైంది. కార్యకర్తలతో చర్చించి రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.