NCERT : చరిత్ర పుస్తకాల్లో రామాయణం,మహాభారతం.. NCERT కీలక సిఫార్సులు
ఈ వార్తాకథనం ఏంటి
పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మార్పులు, చేర్పుల విషయంలో NCERT కమిటీ కీలక సిఫార్సులు చేసింది.
ఈ నేపథ్యంలో చరిత్ర పుస్తకాల్లో రామాయణం(Ramayana), మహాభారతం (Magabharata) వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం.
ఇక పాఠశాలల్లోని తరగతి గదులపై రాజ్యాంగ పీఠకను స్థానిక భాషల్లోనే రాయాలని ఎన్‌సీఈఆర్టీ కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు పలు కథనాలను ప్రచురించాయి.
సాంఘిక శాస్త్రంలోని చరిత్ర ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా ఉంది. దీన్ని నాలుగు భాగాలుగా విభజించాలని ప్రాతిపాదించింది.
Details
స్వాతంత్య్ర సమరయోధుల గురించి విద్యార్థులకు అవగాహన ఉండాలి
ఇందులో బ్రిటీష్ కాలం, మధ్యయుగం, క్లాసిక్ పీరియడ్, ఆధునిక భారతంగా నాలుగు భాగాలుగా విభజించారు.
ప్రస్తుతం ఈ క్లాసిక్ పీరియడ్‌లో భాగంగా మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలు, పురాళణాలను చేర్చాలని వాటి గురించి విద్యార్థులకు కొంతైన అవగాహాన ఉండాలని ఈ కమిటీ ఛైర్మన్ సీఐ ఐజాక్ వెల్లడించారు.
మరోవైపు చరిత్ర పుస్తకాల్లో భారతీయ రాజుల పాలన గురించి, సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర సమరయోధుల గురించి పాఠ్యాంశాలుగా చేర్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ సిఫారసులు చేయడం విశేషం.
పాఠ్యపుస్తకాల్లో కొత్తస సిలబస్ రూపకల్పన జరుగుతోందని, అయితే వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని ఎన్సీఈఆర్టీ తెలిపింది.