Page Loader
Dal With 24-Carat Gold Dust: 24-క్యారెట్ బంగారంతో దాల్.. వైరల్ అవుతున్న వీడియో 
24-క్యారెట్ బంగారంతో దాల్.. వైరల్ అవుతున్న వీడియో

Dal With 24-Carat Gold Dust: 24-క్యారెట్ బంగారంతో దాల్.. వైరల్ అవుతున్న వీడియో 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2024
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

దుబాయ్‌లోని సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో రణవీర్ కి విపరీతమైన ప్రజాదరణ ఉంది. అతని రెస్టారెంట్లోనే బంగారంతో దాల్ కర్రీని తయారు చేస్తున్నారు. 24 క్యారెట్ల బంగారాన్ని పొడి చేసి చెక్క పెట్టెలోని గిన్నెలో పప్పు వడ్డిస్తున్నారు. ఇప్పుడు, ఈ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. 'దాల్ కష్కన్' అని పిలిచే ప్రత్యేక వంటకం రెస్టారెంట్ ప్రత్యేకమైన ఆహార పదార్థాలలో ఒకటి. దీని ధర 58 దిర్హామ్‌లు (సుమారు ₹ 1,300).

Details 

 14 లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించిన వీడియో 

దీని తయారీ విధానంకు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 'దాల్ కష్కాన్' వీడియోను మెహుల్ హింగు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ వీడియోలో ప్రీమియం మసాలాలు, నెయ్యితో తయారు చేచేసిన పప్పుతో జాగ్రత్తగా కలుపుతారు. సర్వర్ కస్టమర్‌కు డిష్ ప్రత్యేకతను కూడా వివరిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 14 లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించగా దాదాపు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

24-క్యారెట్ బంగారం దాల్ వీడియో ఇదే..