శ్రీరాముడి విగ్రహం నిర్మాణం కోసం అయోధ్యకు చేరుకున్న అరుదైన శిలలు
నేపాల్ నుంచి అరుదైన రెండు సాలిగ్రామ శిలలు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకున్నాయి. ఈ శిలలతో గర్భగుడిలో శ్రీరాముడు, సీతమ్మ తీర్చిదిద్దనున్నారు. విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి రాజేంద్ర సింగ్ పంకజ్ నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లా నుంచి రెండు సాలిగ్రామ శిలలను తీసుకొచ్చినట్లు ఫిబ్రవరి 2020లో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, బాబ్రీ మసీదు స్థలంలో అయోధ్యలో కొత్త రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. రామమందిర నిర్మాణ కోసం వివాదాస్పద స్థలంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సుమారు 2.77 ఎకరాలు మంజూరు చేశారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ ట్రస్టు రూ. 1,800 కోట్ల వ్యయంతో రామ మందిరాన్ని నిర్మిస్తోంది.
6కోట్ల ఏళ్ల నాటి సాలిగ్రామ శిలలు
అయోధ్యకు చేరుకున్న రెండు సాలిగ్రామ శిలలకు 6కోట్ల ఏళ్ల చరిత్ర ఉంది. రెండు వేర్వేరు ట్రక్కులపై శిలలను అయోధ్యకు తీసుకొచ్చారు. అందులో ఒకటి 26 టన్నుల బరువు ఉండగా, మరొకటి 14 టన్నుల బరువు ఉంటుంది. శిలలు అయోధ్యకు చేరుకోగానే, పూజారులు పూజలు చేసి, ప్రత్యేకంగా అలంకరించారు. నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లాలో గండకీ నదిలో శిలలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నాటికి శ్రీరాముడు, సీతా దేవి ఉత్సవ విగ్రహాలు సిద్ధం కానున్నాయి. సాలిగ్రామ శిలను హిందువులు శ్రీ విష్ణువు అవతారంగా భావిస్తారు. అందుకే ప్రత్యేకంగా పవిత్ర స్థలంగా భావించే గండకీ నదిలో ఈ శిలలను వెతికి మరీ తీసుకొచ్చారు.