Rashmika : ఏఐతో రష్మిక మార్ఫింగ్ వీడియో సంచలన వైరల్..కఠిన చర్యలకు అమితాబ్ డిమాండ్
దక్షిణాది సినీపరిశ్రమలో మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న యంగ్ హిరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు.తాజాగా ఈ నటీమణి చిక్కుల్లో పడ్డారు. ఈ మేరకు నెట్టింట ఆమెపై ఓ వీడియో వైరల్‌గా మారింది.ఏఐతో రష్మిక ముఖాన్నిలో డీప్ ధరించిన ఓ మహిళకు మార్ఫింగ్ చేశారు. సదరు వీడియో నెట్టింట అలజడులు రేపింది.దీంతో ఓ జర్నలిస్టు జరిగిన వాస్తవాన్ని బహిర్గతం చేశారు. డీప్ ఫేక్ ఏఐతో అలా తయారు చేశారని నెటిజన్లను అలెర్ట్ చేశారు.దీనిపై స్పందించిన అమితాబ్ బచ్చన్, బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. తప్పుడు సమాచారాన్ని ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే పరిష్కరించాలని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఏప్రిల్ 2023లో నోటిఫై చేసిన ఐటీ నిబంధనలను ప్రస్తావించారు. సోషల్ మీడియాలు తప్పనిసరిగా చట్టపరమైన బాధ్యతగా ఈ మార్గదర్శకాలను పాటించాలన్నారు.