
Indian Navy: ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమే.. త్రిశూల శక్తి చూపించిన నేవీ
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదిరాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత నౌకాదళం(Indian Navy) ఓ శక్తివంతమైన సందేశాన్ని జాతికి ఇచ్చింది. సముద్రంలో గస్తీ వేసే సమయంలో తీసిన ఓ ఫొటోను నౌకాదళం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.
ఆ చిత్రంలో ఐఎన్‌ఎస్ కోల్‌కతా, స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గామి, ధ్రువ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH Dhruv)లు కనిపించాయి.
'భారత నేవీ త్రిశూల శక్తి.. సముద్రంపై, లోపల, అలల మీద''అంటూ ఒక బలమైన క్యాప్షన్ జోడిస్తూ - 'Anytime Anywhere Anyhow' అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఉపయోగించారు. అయితే ఇటీవల ధ్రువ్ హెలికాప్టర్ల కార్యకలాపాలను నిలిపివేసిన నేపథ్యంలో, ఈ ఫోటో పాతదై ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
Details
భారత
అయినప్పటికీ, ఇది నెట్టింట్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. పహల్గాంలో ఏప్రిల్ 22న బైసరన్ లోయ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ దాడికి 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (The Resistance Front) అనే ఉగ్రసంస్థ ప్రమేయముందని భావిస్తున్నారు. ఇది లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా గుర్తించబడింది.
ఈ దాడి నేపథ్యంలో పాక్‌పై తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం - సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం సహా పలు కీలక చర్యలు చేపట్టింది.
ఇక నౌకాదళానికి సంబంధించిన ధ్రువ్ హెలికాప్టర్ల కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ, ఆయుధ దళాల మద్య నేవీకి మాత్రం ఇంకా స్పష్టమైన అనుమతి లభించలేదు.
Details
భారత నేవి
స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గాములు భారత నేవీలో కీలకంగా మారాయి. ఇవి శత్రువుల యుద్ధ నౌకలను, జలాంతర్గాములను గుర్తించి దాడి చేయగలవు.
స్టెల్త్ లక్షణాలు కలిగి ఉండే ఈ జలాంతర్గాములు ఫ్రాన్స్ సహకారంతో రూపొందించబడ్డాయి. టోర్పెడోలు, నౌకా విధ్వంసక క్షిపణులతో సముద్రంలో శత్రువులకు భయాందోళన కలిగించగలవు.
అలాగే ఐఎన్‌ఎస్ కోల్‌కతా భారత నౌకాదళంలోని శక్తిమంతమైన ప్రధాన డెస్ట్రాయర్‌లలో ఒకటిగా పేర్కొన్నారు.
ఈ నౌక భద్రత, శక్తి సామర్థ్యాల్లో ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఈ విధంగా, ఉగ్రదాడుల నేపథ్యంలో భారత నౌకాదళం తన శక్తి ప్రదర్శన ద్వారా దేశ రక్షణపై తాము ఎంత ముడుపుగా ఉన్నామనే విషయాన్ని స్పష్టం చేసింది.