NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్
    రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్
    భారతదేశం

    రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 15, 2023 | 11:22 am 0 నిమి చదవండి
    రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్
    జెన్‌కో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి

    ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విద్యుదుత్పత్తి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. శనివారం 105.620 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని నమోదు చేసింది. శుక్రవారం అర్ధరాత్రి 12 నుంచి శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకూ సుమారు 114 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయగా.. జెన్ కో వినియోగానికి పోనూ 105.620 మిలియన్ యూనిట్లు గ్రిడ్ కు సరఫరా చేసింది. ఒక్క రోజులో 5137 మెగావాట్లను సొంతంగా అందించడం ఓ రికార్డు అని జెన్ కో అధికారులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఒకరోజులో ఇదే అత్యధిక ఉత్పత్తిగా నిలిచింది. రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించినందుకు ఏపీ జెన్ కో ఉద్యోగులను మేనేజింగ్ డైరక్టర్ చక్రధర్ బాబు అభినందనలు తెలిపారు.

    విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లో నూతనంగా మరో కొత్త యూనిట్ 

    వేసవి తీవ్రత కారణంగా విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేసి రాష్ట్ర అవసరాలను తీర్చడానికి మరింత అంకిత భావంతో పనిచేయాలని ఉద్యోగులకు తెలియజేశారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందున ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వ సహకారంతో ఏపీ జెన్ కో అన్ని చర్యలు తీసుకుంటోందని ఎండీ వెల్లడించారు. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన కొత్త యూనిట్ విద్యుదుత్పత్తిని త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. లోయర్ సీలేరులో మరో 230 మెగావాట్ల ఉత్పత్తి కోసం రెండు యూనిట్ల నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టి ఏడాదిలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    విజయవాడ సెంట్రల్
    విద్యుత్

    విజయవాడ సెంట్రల్

    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం ఎంపీ
    విజయవాడలో భారీ వర్షం.. నైరుతి విస్తరణతో చల్లబడుతున్న ఆంధ్రప్రదేశ్  వర్షాకాలం

    విద్యుత్

    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్
    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం బొగ్గు శాఖ మంత్రి
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలంగాణ
    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023