LOADING...
OPERATION SINDOOR: ఆపరేషన్ సింధూర్.. ఉత్తర్‌ప్రదేశ్'లో రెడ్ అలర్ట్.. యూపీ పోలీసులు 'పూర్తిగా సిద్ధంగా ఉన్నారు':డిజిపి 
ఆపరేషన్ సింధూర్.. ఉత్తర్‌ప్రదేశ్'లో రెడ్ అలర్ట్.. యూపీ పోలీసులు 'పూర్తిగా సిద్ధంగా ఉన్నారు':డిజిపి

OPERATION SINDOOR: ఆపరేషన్ సింధూర్.. ఉత్తర్‌ప్రదేశ్'లో రెడ్ అలర్ట్.. యూపీ పోలీసులు 'పూర్తిగా సిద్ధంగా ఉన్నారు':డిజిపి 

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2025
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషన్ సిందూర్' పేరిట చర్యలు చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో సుమారు 90 మంది ఉగ్రవాదులను భారత ఆర్మీ మట్టుబెట్టినట్లు సమాచారం. ఈ దాడుల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో భద్రతా పరమైన కారణాలతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ విభాగాలు రక్షణ శాఖతో సమన్వయంగా పని చేయాలని యూపీ డీజీపీ ఆదేశించారు. భారత ఆర్మీ ఈ దాడులను నిర్దిష్ట ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే జరిపిందని, పాకిస్తాన్ సైన్యంపై ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టంగా ప్రకటించింది. ఉగ్రవాద స్థావరాలపై దాడులకు 'ఆపరేషన్ సింధూర్' అని పేరు పెట్టారు. ఈ దాడులు జరిగిన ప్రాంతాల్లో భారత ఆర్మీ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది.

వివరాలు 

జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు

ఇక పాకిస్తాన్‌లోని బహావల్పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారనే ఖచ్చితమైన సమాచారం భారత ఆర్మీకి లభించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాలను పాకిస్తాన్ మీడియా కూడా ధృవీకరించడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూపీ డీజీపీ చేసిన ట్వీట్