Page Loader
CAA: ' సీఏఏపై అబద్ధాలు చెప్పడం ఆపండి'.. కేజ్రీవాల్‌పై బీజేపీ ఎదురుదాడి 
CAA: ' సీఏఏపై అబద్ధాలు చెప్పడం ఆపండి'.. కేజ్రీవాల్‌పై బీజేపీ ఎదురుదాడి

CAA: ' సీఏఏపై అబద్ధాలు చెప్పడం ఆపండి'.. కేజ్రీవాల్‌పై బీజేపీ ఎదురుదాడి 

వ్రాసిన వారు Stalin
Mar 13, 2024
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

పౌరసత్వ సవరణ చట్టం (సీఎఎ) అమల్లోకి తీసుకురావడంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శించారు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ విమర్శలపై బీజేపీ ఎదురుదాడి చేసింది. సీఏఏపై అబద్ధాలు చెప్పడం మానుకోవాలని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ హితవు పలికారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వలస వచ్చిన పేదలకు భారత్‌లో ఇళ్లు, ఉద్యోగాలు కల్పించాలని బీజేపీ చూస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే ఈ కామెంట్స్‌పై రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. సీఏఏ అమల్లోకి రావడం వల్ల ఎవరూ తమ ఉద్యోగాన్ని లేదా పౌరసత్వాన్ని కోల్పోరని చెప్పారు.

#2

పునరావాసం కల్పించడం నైతిక బాధ్యత : రవిశంకర్ ప్రసాద్ 

భారత్‌కు వచ్చిన వాళ్లందరూ, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో చిత్రహింసలకు గురైన వాళ్లే అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. వారికి పునరావాసం కల్పించడం భారత ప్రభుత్వ నైతిక బాధ్యత అన్నారు. సీఏఏ వల్ల భారతీయ ముస్లీంల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఏం అన్నారు? పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లో 3.5 కోట్ల మంది మైనారిటీలు ఉన్నారని కేజ్రీవాల్ అన్నారు. 'బీజేపీ మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వదు. కానీ పాకిస్థాన్ నుంచి వచ్చే పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటోంది. దేశంలో ఉంటున్న ప్రజలు చాలా మంది నిరాశ్రయులయ్యారు. కానీ పాకిస్థాన్ ప్రజలు ఇక్కడ స్థిరపడాలని బీజేపీ కోరుతోంది' కేజ్రీవాల్ విమర్శించారు.