Page Loader
PM-KISAN Funds:పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల.. ఒక్కో రైతుకు రూ. 2వేలు జమ
పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల.. ఒక్కో రైతుకు రూ. 2వేలు జమ

PM-KISAN Funds:పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల.. ఒక్కో రైతుకు రూ. 2వేలు జమ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2024
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని కోట్లాది మంది రైతులకు నవరాత్రి కానుకగా, ప్రధాని నరేంద్ర మోదీ "కిసాన్ సమ్మాన్ నిధి" పథకం 18వ విడత నిధులను విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా, ప్రధాని 9.4 కోట్ల మంది రైతులకు రూ. 20 వేల కోట్లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా రైతుల ఖాతాల్లో బదిలీ చేశారు. ఒక్కో రైతు ఖాతాలో రూ. 2000 నగదు జమ చేశారు. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూ. 3.45 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2019లో ప్రారంభమైంది, దీని కింద రైతులకు సంవత్సరానికి రూ. 6వేలను మూడు వాయిదాలుగా అందిస్తారు.

Details

91.51 లక్షల మంది రైతులకు లబ్ధి

ఈ పథకం ద్వారా మహారాష్ట్రలో ఇప్పటికే 17 విడతల్లో 1.20 కోట్ల మంది రైతులకు రూ. 32,000 కోట్లు పంపిణీ చేశారు. 18వ విడతలో రాష్ట్రంలోని 91.51 లక్షల మంది రైతులకు రూ. 1,900 కోట్లకు పైగా లబ్ధి చేకూరింది. అదనంగా, మహారాష్ట్ర రైతులకు 'నమో షెత్కారీ మహాసమ్మన్ నిధి యోజన' కింద రూ. 2,000 కోట్ల అదనపు ప్రయోజనాన్ని కూడా ప్రధాని మోదీ అందించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.