Telangana Beers: తెలంగాణ మందు బాబులకు ఊరట.. బీర్ల సరఫరాపై యూబీ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ బీర్ల ప్రియులకు శుభవార్త అందించింది.
తెలంగాణలో బీర్ల నిల్వలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో బీర్ల సరఫరాను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. ఈ సమస్యపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.
ప్రస్తుతానికి, బీర్ల సరఫరాను పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.
బీర్ల ధరల పెంపు మరియు పాత బకాయిల విడుదలకు సంబంధించి బేవరేజ్ కార్పొరేషన్ సానుకూలంగా స్పందించిందని పేర్కొంది.
Details
బీర్ల సరఫరాకు చర్యలు
వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మధ్యంతర చర్యలు తీసుకున్నామని యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ వెల్లడించింది.
సెబీ నియమావళి ప్రకారం తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బీర్ల సరఫరాను తక్షణమే అమలులోకి తీసుకొస్తున్నట్లు చెప్పింది.
టీజీబీఎల్‌తో నిర్మాణాత్మక చర్చలు కొనసాగుతున్నాయని, బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదల వంటి అంశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బేవరేజ్ కార్పొరేషన్ హామీ ఇచ్చిందని వివరించింది.