Page Loader
HLFT-42 యుద్ధ విమానంపై హనుమతుడి బొమ్మ తొలగింపు

HLFT-42 యుద్ధ విమానంపై హనుమతుడి బొమ్మ తొలగింపు

వ్రాసిన వారు Stalin
Feb 14, 2023
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

శిక్షణ కోసం వినియోగించే అత్యాధునిక HLFT-42 యుద్ధ విమానంపై ఉన్న హనుంతుడి బొమ్మను తలొగించినట్లు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్( హెచ్ఏఎల్) మంగళవారం ప్రకటించింది. సోమవారం బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా 2023లో HLFT-42 యుద్ధ విమానాన్ని ప్రదర్శించారు. ఆ విమానం తోక భాగంపై హనమంతుడి బొమ్మ కనిపించడంతో అది గమనించిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ( హెచ్ఏఎల్), దాన్ని తొలగించింది. హెచ్ఏఎల్ తొలి స్వదేశీ యుద్ధ విమానం 'మారుత్' కాగా, దానికి కొనసాగింపుగా అత్యాధునిక హంగులతో HLFT-42 ఎయిర్‌క్రాఫ్ట్‌ను హెచ్‌సీఎల్ తయారు చేసింది. 'మారుత్' అంటే అంజనేయుడి పేరు కాబట్టి, హెచ్ఏఎల్ తొలుత హనుమంతుడి పేరును విమానం తోకపై ముద్రించింది.

యుద్ధ విమానం

సూపర్‌సోనిక్ టెక్నాలజీలో పైలట్‌లకు శిక్షణ

సూపర్‌సోనిక్ టెక్నాలజీలో పైలట్‌లకు శిక్షణ ఇవ్వడానికి HLFT-42 ఉపయోగపడుతుంది. అంతకు ముందు శిక్షణ కోసం ఉపయోగించే హాక్-132 సబ్‌సోనిక్ ట్రైనర్, మిగ్-21 వంటి యుద్ధ విమానాల కంటే ఇది అత్యాధునికమైనది. ఇది ఫ్లై బై వైర్ కంట్రోల్ (ఎఫ్‌బీడబ్ల్యూ) సిస్టమ్‌లతో కూడిన యాక్టివ్ ఎలక్ట్రానిక్‌గా స్కాన్డ్ అర్రే (ఏఈఎస్ఏ), ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (ఈడబ్ల్యూ) సూట్, ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ (IRST) వంటి అత్యాధునిక ఏవియానిక్స్‌ ఇందులో అమర్చారు. ఆసియాలోనే అతిపెద్ద ఎయిరో షో 'ఏరో ఇండియా 2023' 14వ ఎడిషన్‌ను మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో స్వదేశీ సాంకేతికతలను ప్రదర్శించడంతో పాటు విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది.