తదుపరి వార్తా కథనం

BSF : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం బీఎస్ఎఫ్ చీఫ్, డిప్యూటీ చీఫ్ తొలగింపు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 03, 2024
10:04 am
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
సరిహద్దు భద్రతా దళం డైరక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ తో పాటు డిప్యూటీ స్పెషల్ డీజీ వైబీ ఖురానియాలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తొలగింపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఆ ఇద్దరు అధికారులను వారి రాష్ట్రాల కేడర్‌లకు పంపిస్తున్నట్లు ప్రకటించింది.
1989 బ్యాబ్‌కు చెందిన కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి నితిన్ అగర్వాల్ గతేడాది జూన్‌లో బీఎస్ఎఫ్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.
Details
చోరబాటుదారులను అరికట్టడంలో బీఎన్ఎఫ్ విఫలం
ఇక ఖురానియా 1990వ బ్యాచ్ ఓడిశా కేడర్ చెందినవారు.
వారి తొలగింపునకు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇటీవల అంతర్జాతయ సరిహద్దు వెంబడి భారత్ లోకి వస్తున్నచొరబాటుదారుల సంఖ్య పెరుగుతోంది.
వీటిని అరికట్టడంలో బీఎన్ఎఫ్ విఫలమైందని ఆరోపణలొచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.